Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో కేసు
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది నాలుగో కేసు నమోదైంది. గతేడాది 2023లో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 12వ తరగతితో పాటు జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు విద్యార్థికి ఉదయం నుండి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు వార్డెన్‌ను సంప్రదించగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు సీలింగ్ ఫ్యాన్‌కు విద్యార్థి మృతదేహం వేలాడుతూ కనిపించింది. భారతదేశంలో ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష సన్నాహాలకు కోట కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం, ఈ పోటీ ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలనే ఆశతో వేలాది మంది అభ్యర్థులు నగరానికి వస్తారు.