Page Loader
Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..! 
పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..!

Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2023
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసుపై విచారణ జరుపుతున్న దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో అరెస్టయిన ఐదుగురితో సంబంధం ఉందన్న అనుమానంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మహేష్,కైలాష్‌గా గుర్తించారు.ఇద్దరూ రాజస్థాన్ నివాసితులు. 'జస్టిస్ ఫర్ ఆజాద్ భగత్ సింగ్'అనే సోషల్ మీడియా గ్రూప్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నారు. స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ విచారణలో,దాడి బృందంలో మహేష్ కూడా భాగం కాబోతున్నాడని తెలిసింది.అయితే కొన్ని కారణాల వల్ల అతని కుటుంబ సభ్యులు అతన్ని అడ్డుకున్నారు. అంతే కాకుండా,ఐదవ నిందితుడు,సూత్రధారి అయిన లలిత్ ఝా ఢిల్లీ నుండి రాజస్థాన్‌లోని కుచామన్‌కు చేరుకున్న తర్వాత అతని సహచరుల మొబైల్ ఫోన్‌లను తగ్గాలబెట్టడంలో కూడా మహేష్ సహాయం చేశాడు.

Details 

నెలరోజుల క్రితమే దాడికి సన్నాహాలు

మరోవైపు, గత రాత్రి, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్ (DCP), అదనపు పోలీసు కమిషనర్లతో సహా సీనియర్ పోలీసు అధికారులు లలిత్ ఝాను విచారించారు. ఈ సమయంలో అతను మొత్తం సంఘటనను అధికారులకు వివరించాడు. విచారణలో నెలరోజుల క్రితమే దాడికి సన్నాహాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పార్లమెంటులో ప్రవేశించడానికి ప్రవేశ పాస్ అవసరం ఉండడంతో సులువుగా పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రతి ఒక్కరు పాస్‌ను ఏర్పాటు చేసుకోవాలని లలిత్ దాడిలో పాల్గొన్న మిగతావారిని కోరారు. రాజస్థాన్‌లోని హోటల్ నుండి లలిత్ న్యూస్ ఛానెల్‌ల ద్వారా జరుగుతున్న పరిణామాలు,పోలీసుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచారు.

Details 

స్పెషల్ ఆర్డర్‌పైన లక్నోలో రెండు జతల బూట్లు

ఈ కేసులో మరిన్ని వివరాలను వెలికితీసేందుకు, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. ఇవి లక్నో, మైసూర్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానాలలోని నిందితులతో సంబంధం ఉన్న ప్రదేశాలకు వెళ్లాయి. అంతే కాకుండా, నిందితుడిని 7 రోజుల పాటు స్పెషల్ సెల్ కస్టడీలో ఉంచినందున, క్రాస్ వెరిఫికేషన్,సాక్ష్యాలను గుర్తించడం కోసం నిందితులను వేర్వేరు ప్రదేశాలకు కూడా తీసుకువెళతారు. లక్నోలో రెండు జతల బూట్లు స్పెషల్ ఆర్డర్‌పైన తయారు చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంటులో బూట్లు తనిఖీ చెయ్యరని నిందితులు తెలుసుకున్నారు. పార్లమెంటు లోపల పొగ డబ్బాను తీసుకెళ్లడానికి ఇదే సులభమైన మార్గం.

Details 

భద్రతా ఉల్లంఘన ఘటనను రీక్రియేట్‌ చేయాలని పోలీసుల యోచన 

ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం బుధవారం నాటి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన అలజడి ఘటనను శని లేదా ఆదివారాల్లో పార్లమెంటు కాంప్లెక్స్‌కు తీసుకువెళ్లడం ద్వారా రి క్రియట్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ 'సీన్‌ రీక్రియేషన్‌ వల్ల నిందితులు కలర్ స్ప్రేతో పార్లమెంటు భవనంలోకి ఎలా ప్రవేశించారు, వారి ప్రణాళికను ఎలా అమలు చేశారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఇది పోలీసులకు సహాయపడుతుందని స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఘటన జరిగిన నాడే ఈ సీన్‌ రీక్రియేషన్‌ ప్రక్రియ చేపట్టాలని పోలీసులు భావించినా.. సభా కార్యకలాపాల వల్ల అది సాధ్యపడలేదు.