Loading...
BJP: రామ్‌లీలా మైదాన్‌లో 'గుండాల జాతర'.. ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ సెటైర్లు
రామ్‌లీలా మైదాన్‌లో 'గుండాల జాతర'.. ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ సెటైర్లు

BJP: రామ్‌లీలా మైదాన్‌లో 'గుండాల జాతర'.. ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ సెటైర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం(నవంబర్ 1)ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు తీవ్రరూపం దాల్చాయి. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుండగా.. సుమారు 50 వేల మంది వస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీని మరోసారి రాజకీయంగా తెరపైకి తీసుకువచ్చేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఢిల్లీ బీజేపీ ఈ కార్యక్రమాన్ని 'గుండాల జాతర'గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ ఆదివారం కూడా ఖాళీగా ఉండకుండా చూసేందుకు మరో ఖరీదైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించింది.

వివరాలు

రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR), ఓట్ల చోరీ ఆరోపణలకు నిరసనగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీ లక్ష్యాలపై బీజేపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్‌గిల్ కూడా ఇండియా కూటమి ర్యాలీపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని, అదే నిజమైతే ఆయన రెండు నియోజకవర్గాల్లో ఎలా విజయం సాధించారని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఎలా గెలిచారని నిలదీశారు.

వివరాలు

అధికారానికి చాలా దూరంగా ఉన్నారు

కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉండటాన్ని కూడా జైవీర్ షేర్‌గిల్ ప్రస్తావించారు.

ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి లేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న రాష్ట్రాలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉన్న కాలవ్యవధి ఇలా ఉన్నాయి.

తమిళనాడు - 59 ఏళ్లు

పశ్చిమ బెంగాల్ - 49 ఏళ్లు

సిక్కిం - 42 ఏళ్లు - ఉత్తరప్రదేశ్

37 ఏళ్లు - బీహార్ - 36 ఏళ్లు

గుజరాత్ - 30 ఏళ్లు - ఒడిశా

26 ఏళ్లు - నాగాలాండ్ - 23ఏళ్లు

మహారాష్ట్ర - 12 ఏళ్లు

ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎందుకు లేరని జైవీర్ షేర్‌గిల్ ప్రశ్నించారు.

ADVERTISEMENT