Page Loader
Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి
విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి

Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2024
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద శుక్రవారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో కొందరు చిక్కుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.