QR code scam: అయోధ్య రామ మందిరం పేరుతో 'క్యూఆర్ కోడ్ స్కామ్'
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జనవరి 22న శ్రీరాముని ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
అయితే ఆలయ ప్రారంభానికి ముందే రామ మందిరం పేరుతో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి.
రామమందిరం పేరుతో ప్రజలను విరాళాలు అడుగుతున్నారని, వారిని అయోధ్యకు ఆహ్వానిస్తామని మభ్యపెడుతున్నారని హిందూ సంస్థలు చెబుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అయోధ్య, ఉత్తర్‌ప్రదేశ్' అనే నకిలీ పేజీని సృష్టించి, ఆ పేజీలో QR code సాయంతో, రామాలయానికి వీలైనంత ఎక్కువ విరాళాలు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయోధ్య
సైబర్ నేరగాడితో ఫోన్‌లో మాట్లాడిన వీహెచ్‌పీ సభ్యుడు
అయోధ్యకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యుడు కూడా ఫోన్‌లో సైబర్ మోసగాడితో మాట్లాడారు.
ఈ సందర్భంగా సైబర్ మోసగాడు వీలైనంత ఎక్కువ విరాళం ఇవ్వాలని వీహెచ్‌పీ సభ్యుడిని కోరడం గమనార్హం.
ఈ సంభాషణలో దాత పేరు, నంబర్ డైరీలో నమోదు చేయబడుతుందని, ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అందరినీ అయోధ్యకు పిలుస్తామని సైబర్ మోసగాడు చెప్పడం గమనార్హం.
ఈ విషయమై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం' పేరుతో కొందరు వ్యక్తులు నకిలీ ఐడీలు తయారు చేసి డబ్బును మోసం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.