Page Loader
Fire accident: దిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది
దిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది

Fire accident: దిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ బావనా పారిశ్రామిక వాడలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాక్-సిలోగల సెక్టార్-3లో ఉన్న ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా చెలరేగడం స్థానికుల దృష్టికి వచ్చిన వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అతితరంగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఫైరింజన్‌ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

Details

16 ఫైరింజన్ లో మంటలార్పుతున్న సిబ్బంది

మంటలు భారీగా వ్యాపించడంతో 16 ఫైరిజంన్‌లను రప్పించారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ఈ ఘటనను ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఎవరికి కూడా హాని జరగలేదని, అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగకపోయినా, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.