LOADING...
Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం
హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం

Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి హరీశ్‌రావుకు పెద్ద ఊరట కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన హరీశ్‌రావు ఎన్నికల అఫిడవిట్‌లో అసలు వివరాలు దాచారని, ముఖ్యంగా తన కుమారుడి వివరాలను వెల్లడించలేదని బీఎస్పీ అభ్యర్థి చక్రధర్‌ గౌడ్‌ అభియోగపెట్టారు. ఈ ఆరోపణలతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును తాజాగా పరిశీలించిన హైకోర్టు చక్రధర్‌ గౌడ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తద్వారా హరీశ్‌రావుకు న్యాయపరంగా ఊరట లభించింది.

Details

కక్షసాధింపు చర్యలు మానుకోవాలి

ఈ నేపథ్యంలో స్పందించిన హరీశ్‌రావు... ప్రతిపక్షాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా రాజకీయ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని కోరారు. తాను అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎదుర్కొని తీరుతామని హెచ్చరించారు.