Samajwadi Party: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు.. ఎంవీఏను విడిచిన సమాజ్‌వాదీ పార్టీ
మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పెద్ద దెబ్బతీసింది. ఎంవీఏ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ శనివారం ప్రకటన చేశారు. శివసేన (యూబీటీ) హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ ఎజెండాను మరింత ముద్రించారు. అంతర్గత సమావేశాల్లో ఇదే విధానం కొనసాగించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు అనుకూలంగా సోషల్ మీడియా పోస్టులు చేశారు. ఎంవీఏలో సీట్ల పంచకం, ప్రచార సమన్వయంపై ఎస్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రమాణ స్వీకారానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు
ప్రజలకు సంబంధించిన అంశాలపై ఎంవీఏలో సరైన చర్చ జరగడం లేదని, శివసేన చర్యలు తమకు ఆమోదయోగ్యంగా లేవని అజ్మీ విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంవీఏ బహిష్కరించినప్పటికీ, ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అసిమ్ అజ్మీ, రైస్ షేక్ హజరయ్యారు. ఈ క్రమంలో, ఎంవీఏతో తమ సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎస్పీ ఈ కీలక నిర్ణయం ఎంవీఏ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.