Special Trains to Araku:రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అరుకు పర్యాటకుల కోసం ప్రత్యేక సర్వీసులు
వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల సీజన్‌ను పురస్కరించుకొని, పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుండి 15 వరకు, అరకు వాలీ పర్యాటక రైలును ప్రత్యేకంగా నడవనుంది. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరే ఈ రైలు, అరకు చేరడానికి 11:30 గంటలకు సమయం పడుతుంది.
అక్టోబర్ 5 నుంచి 15 వరకు ప్రత్యేక రైలు
తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సీజన్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ప్రత్యేక రైళ్ల ద్వారా ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని, పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్ధేశంతో ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.