Page Loader
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం
వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును ఆమోదించింది. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదికను సమర్పించారు. బిజినెస్ లిస్ట్ ప్రకారం జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్, వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీ రిపోర్టును హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో సభ ముందుంచనున్నారు. ఈ బిల్లుకు సంబంధించి జనవరి 29న ముసాయిదా నివేదికను, సవరించిన బిల్లును జేపీసీ ఆమోదించింది.

Details

వక్ఫ్ బిల్లు-1995 కి 25 సవరణలు 

జేపీసీ వక్ఫ్ బిల్లు-1995లోని 14 నిబంధనలలో 25 సవరణలు చేసింది. ఈ సవరణల దృక్పథంలో వక్ఫ్ ఆస్తుల నియంత్రణ కోసం తీసుకున్న 1995 చట్టంలో కొన్ని అధికారపు దుర్వినియోగం, అవినీతి, ఆక్రమణలు వంటి సమస్యలు ఉండటం వల్ల సవరించాలని కేంద్రం నిర్ణయించింది. విపక్షాల అసమ్మతి కాంగ్రెస్‌తో సహా విపక్ష ఎంపీలు ఈ సవరణ బిల్లును ఏకపక్షంగా మార్చారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఈ బిల్లుపై తన అసమ్మతి నోట్‌లోని విభాగాలను తనకు తెలియకుండానే సవరించారని ఆరోపించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసమ్మతి నోట్ సమర్పించిన సయ్యద్ నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతిపక్ష గొంతులను అణిచివేసే ప్రయత్నంగా ఈ సవరణలను అభివర్ణించారు.