తదుపరి వార్తా కథనం

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక మైలురాయి… కమిషన్ నివేదిక సమీకరణ పూర్తి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 07, 2025
03:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిటీ నివేదిక దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగా ఇప్పటి వరకు కమిషన్ మొత్తం 115 మందిని ప్రశ్నించి, వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. అదేకాగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలను కూడా కమిటీ సమగ్రంగా విశ్లేషించింది. అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని సమీక్షించి, నివేదికను పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు.