Page Loader
Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు 
Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు

Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు 

వ్రాసిన వారు Stalin
Mar 04, 2024
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన మహారాష్ట్ర ధులే జిల్లాలో చోటుచేసుకుంది. ఆ తర్వాత చిరుత ఎంత ప్రయత్నించినప్పకీ తలను బయటకు తీసుకోలేకపోయింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పశువైద్యునితో పాటు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని, యంత్రం సహాయంతో బిందెను తొలగించి.. చిరుతను రక్షించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి నీరు తాగేందుకు బిందెలో తల దూర్చగా అందులో ఇరుక్కుపోయింది. మగ చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపొయి దాదాపు ఐదు గంటలు పాటు ఇబ్బంది పడినట్లు ఆర్‌ఎఫ్‌ఓ సవితా సోనావానే తెలిపారు. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిందెలో తల ఇరుక్కున్న చిరుత