
Video: అపార్ట్మెంట్ లోపలికి చొరబడిన చిరుత
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని గురుగ్రామ్ లో నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన ఓ చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ మెట్టు పైకి ఎక్కి చేరుకుంది.
ఆ తరువాత కాసేపటికి అది కిందకి రావడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీలలో రికార్డు అయ్యింది.
విషయం తెలిసిన ప్రజలు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న అటవీ,పోలీస్ అధికారులు వలలతో ఘటనా స్థలికి చేరుకొని దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబరులో,పూణేలో,చికాలీ, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లోకి ప్రవేశించిన చిరుతపులిని పూణే అటవీ శాఖ, RESQ CT వైల్డ్‌లైఫ్ రెస్క్యూ యూనిట్,అగ్నిమాపక విభాగం సంయుక్త ఆపరేషన్‌లో విజయవంతంగా రక్షించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన చిరుత
#WATCH | Haryana: A leopard was spotted in Gurugram's Narsinghpur village. The Forest Department team and Gurugram Police have arrived at the spot. pic.twitter.com/tSGg4U0srf
— ANI (@ANI) January 3, 2024