Page Loader
Earthquake: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు 
ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు

Earthquake: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు 

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లా సమీపంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పితోరాగత్‌కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గతంలో అక్టోబర్ 5న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3:49 గంటలకు ప్రకంపనలు సంభవించాయని ఎన్‌సీఎస్ తెలిపింది. ఇదిలా ఉంటే, ఆదివారం దిల్లీలో భూకంపం సంభంచిగా, రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పితోర్‌ఘర్ జిల్లాలో భూకంపం