LOADING...
Vande Bharat Express: సత్యసాయి జిల్లాలో వందేభారత్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. ఆవులను ఢీకొట్టిన రైలు!
సత్యసాయి జిల్లాలో వందేభారత్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. ఆవులను ఢీకొట్టిన రైలు!

Vande Bharat Express: సత్యసాయి జిల్లాలో వందేభారత్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. ఆవులను ఢీకొట్టిన రైలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పిన ఘటన చోటుచేసుకుంది. హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో కాచిగూడ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు ఆవులను ఢీకొట్టింది. పెద్ద శబ్దం వినిపించడంతో వెంటనే లోకోపైలట్ అప్రమత్తమై రైలును అక్కడే నిలిపివేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

వివరాలు

అరగంట పాటు నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్

అనంతరం పట్టాలపై పడిన ఆవుల కళేబరాలను తొలగించారు. రైలును పూర్తిగా తనిఖీ చేసి సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఘటన కారణంగా సుమారు అరగంటపాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. తర్వాత ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ ఘటనలో ప్రయాణికులు లేదా సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

Advertisement