Page Loader
దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు 
దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు

దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు 

వ్రాసిన వారు Stalin
Jun 09, 2023
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానంలో ఫోన్‌లో బాంబు గురించి మాట్లాడిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 7 (బుధవారం) జరిగిందని విస్తారా ఎయిర్ లైన్ చెప్పింది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన అజీమ్ ఖాన్‌గా గుర్తించారు. విస్తారా ఫ్లైట్ నంబర్ UK-941లో అజీమ్ ఖాన్‌ దిల్లీ నుంచి ముంబైకి కనెక్టింగ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు 'బాంబు' గురించి ఫోన్‌లో మాట్లాడడం విన్న తోటి ప్రయాణికురాలు వెంటనే విమానంలోని సిబ్బందికి సమాచారం అందించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా, సిబ్బంది నిందితుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కి అప్పగించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రయాణికుడి అరెస్టుపై దిల్లీ పోలీసుల ప్రకటన