Page Loader
Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు
ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు

Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

హరియాణా నుంచి బెంగళూరుకు తన ప్రేయసిని కలిసేందుకు వచ్చిన అనిరుద్ధ్ రాజన్ అనే మావోయిస్టుని సీసీఐ శుక్రవారం అరెస్టు చేసింది. అనిరుద్ధ్‌పై సీపీఐ (ఎంఎల్) పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ మావోయిస్టు దళాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత సాహిత్యాన్ని పంపిణీ చేశాడని కూడా నేర అభియోగాలు అతడిపై ఉన్నాయి. గతంలోనూ అతనిపై కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.

Details

పోలీసుల అదుపులో మావోయిస్టు

బెంగళూరుకు నాలుగు రోజుల కిందటే వచ్చిన అనిరుద్ధ్ స్థానిక లాడ్జ్‌లో ఉంటున్నట్లు గుర్తించిన సీసీబీ అధికారులు ఉప్పారపేట పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. విచారణలో అతడు వికాస్ ఫాడ్గే పేరుతో ఆధార్ కార్డు పొందినట్లు తెలిసింది. అనిరుద్ధ్ వద్ద నుంచి నాలుగు సంచులు, పెన్ డ్రైవ్‌లు, ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకు ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆయనపై మరిన్ని వివరాలు రాబట్టడానికి ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు.