LOADING...
హిమాచల్ ప్రదేశ్‌: కొండచరియలు విరిగిపడటంతో 11కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్; వందల మంది రోడ్లపైనే 
హిమాచల్ ప్రదేశ్‌: కొండచరియలు విరిగిపడటంతో 11కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్; వందల మంది రోడ్లపైనే

హిమాచల్ ప్రదేశ్‌: కొండచరియలు విరిగిపడటంతో 11కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్; వందల మంది రోడ్లపైనే 

వ్రాసిన వారు Stalin
Jun 26, 2023
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనజీవనం స్తంభించిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం సాయంత్రం నుంచి మనాలి-చండీగఢ్ హైవేపై వందలాది మంది ప్రజలు, పర్యాటకులు, జాతీయ రహదారిపై చిక్కుకున్నారు. దాదాపు 11కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ల కారణంగా మండి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందల మంది ప్రజలు రోడ్డుపైనే పడిగాపులుకాస్తున్నారు. హోటల్ గదులు అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు రాత్రి నుంచి వాహనాల్లోనే బస చేయాల్సి వచ్చింది. రోడ్డుపై అడ్డంగా ఉన్న భారీ బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని పరిపాలన అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దారి పొడవునా నిలిచిపోయిన వాహనాలు