LOADING...
Engineering: ఇంజినీరింగ్ విద్యలో నూతన అధ్యాయం.. క్వాంటం కంప్యూటింగ్ చేరిక!
ఇంజినీరింగ్ విద్యలో నూతన అధ్యాయం.. క్వాంటం కంప్యూటింగ్ చేరిక!

Engineering: ఇంజినీరింగ్ విద్యలో నూతన అధ్యాయం.. క్వాంటం కంప్యూటింగ్ చేరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంజినీరింగ్ విద్యలో కీలక మార్పులు చేయడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. బీటెక్‌లో 'క్వాంటం కంప్యూటింగ్' సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇంజినీరింగ్‌లో మూడో, నాలుగో సంవత్సరాల సిలబస్‌లో మార్పులు సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ సత్యనారాయణ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఎనిమిది మంది సభ్యులను నియమించారు. అదనంగా ఆరుగురు నిపుణులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

Details

నూతన సిలబస్ లో 20శాతం వరకు మార్పులు

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఇప్పటికే 'క్వాంటం కంప్యూటింగ్' కోర్సుకు సంబంధించిన సిలబస్, క్రెడిట్లను సూచించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు పరిశ్రమలతో అనుసంధానమై ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు నిర్వహించేందుకు సరికొత్త సిలబస్ రూపకల్పన చేస్తున్నారు. స్వయంప్రతిపత్తి కళాశాలలకు నూతన సిలబస్‌లో 20% వరకు మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఈ సిలబస్‌ మార్పు ప్రక్రియలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భాగస్వాములుగా చేసేందుకు చర్యలు చేపడుతోంది.