చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఒక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరపణలపై సుప్రీంకోర్టు సోమవారం ఆయన్ను మందలించిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్యాలెట్ పత్రాలపై ప్రిసైడింగ్ అధికారి టిక్ చేస్తున్నట్లుగా ఆందులో కనపడుతుంది.
ఈ వీడియోను ఆప్ పంజాబ్ యూనిట్ ట్వీట్ చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా షేర్ చేశారు.
'ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది? బీజేపీ ప్రిసైడింగ్ అధికారి ఓటును రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా ఎలా తుంగలో తొక్కారో చూడండి' అంటూ మలివాల్ ఆ వీడియోకు జోడించారు.
సుప్రీంకోర్టు
ఎన్నికల అధికారిని మందలించిన సుప్రీంకోర్టు
ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఎన్నికలను నిర్వహించిన ఎన్నికల అధికారిని సుప్రీంకోర్టు మందలించింది. అతను బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారని, విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఈ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై 'దిగ్భ్రాంతి' చెందిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా ఖూనీ చేయడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికల కేసులో ఫిబ్రవరి 19న తదుపరి విచారణ సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ వ్యక్తిగత హాజరుకావాలని ఆదేశించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ట్వీట్
रंगे हाथों पकड़े गये भाई साहब… pic.twitter.com/nVCHi3bCOE
— Swati Maliwal (@SwatiJaiHind) February 5, 2024