LOADING...
Andhra Pradesh: అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన ఘనత.. ప్రతిష్ఠాత్మక పురస్కారం కైవసం
అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన ఘనత.. ప్రతిష్ఠాత్మక పురస్కారం కైవసం

Andhra Pradesh: అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన ఘనత.. ప్రతిష్ఠాత్మక పురస్కారం కైవసం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో తెలుగు తేజం మరోసారి ప్రతిభ చాటింది. కంప్యూటర్‌ సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అమెరికాలో ప్రతి ఏడాది ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక 'మిన్నెసోటా అస్పిరేషన్స్‌ ఇన్‌ కంప్యూటింగ్‌' అవార్డుల్లో తెలుగు అమ్మాయి అనన్య గోలి స్టేట్‌ హానరబుల్‌ మెన్షన్‌ పురస్కారాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లికి చెందిన గోలి కృష్ణ చైతన్య, సంపా సిన్హా దంపతులు 2014లో అమెరికాకు వెళ్లి ప్రస్తుతం అక్కడ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుమార్తె అనన్య గోలి ప్రస్తుతం ఈడెన్‌ ప్రైరీ హైస్కూల్‌లో సోఫామోర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది.

వివరాలు

హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

ఇది భారత విద్యా విధానంలో పదో తరగతికి సమానం. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో అసాధారణ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన అనన్య, ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును సాధించింది. కంప్యూటర్‌ సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో ఆమె చూపిన నైపుణ్యం, లీడర్‌షిప్‌ సామర్థ్యాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం విశేషం.

Advertisement