Page Loader
Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌

Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య పీవీ కృష్ణ, గోదావరి నదీలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు పేటెంట్‌ సాధించారు. చెన్నై పేటెంట్‌ సంస్థ ఈ పేటెంట్‌ను మంజూరు చేసింది. మంగళవారం ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్‌ చేతుల మీదుగా ఆచార్య కృష్ణ ఈ పేటెంట్ పత్రాన్ని అందుకున్నారు. పులస చేపలోని ప్రొటీన్లు, కొవ్వు తదితర పోషకాలపై తన పరిశోధన వివరాలు ఆచార్య కృష్ణ తెలియజేశారు. ఈ చేప ప్రత్యేకించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఔషధంగా పనిచేస్తోందని తెలిపారు. పరిశ్రమల వ్యర్థాలు గోదావరి నదిలో కలవడం వల్ల ఈ అరుదైన చేపల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Details

పులస పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

పులస పరిరక్షణపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు నదులలో లభించే వివిధ చేపలపై 130కు పైగా జర్నల్‌ వ్యాసాలు ప్రచురించి, 120 సదస్సులు, అనేక వర్క్‌షాప్‌లు ఆచార్య కృష్ణ నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టార్‌ ఆచార్య రత్నశీలామణి, రిజిస్ట్రార్‌ ఆచార్య సింహాచలం, సీడీఈ డైరెక్టర్‌ ఆచార్య వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.