Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
బుధవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వార్ రూమ్‌ను సందర్శించి, ప్రయాగ్‌రాజ్‌లోని ఎనిమిది రైల్వే స్టేషన్లలో జనసమూహ నిర్వహణ పరిస్థితిని సమీక్షించారు.
అలాగే యాత్రికుల రవాణా కోసం ప్రత్యేక రైళ్లను నడిపేలా అధికారులను ఆదేశించారు.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, రెండు రోజుల్లో ప్రయాగ్‌రాజ్ నుంచి 568 రైళ్లు నడిపి, 27.08 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేశారు.
ఫిబ్రవరి 12 సాయంత్రం 6 గంటల వరకు 225 రైళ్లలో 12.46 లక్షల మంది ప్రయాణికులు, ఫిబ్రవరి 11న 343 రైళ్లలో 14.69 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
Details
యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు
బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఈఓ, సీఆర్‌బీ సతీష్ కుమార్‌తో కలిసి వార్ రూమ్‌కు చేరుకుని, ప్రయాగ్‌రాజ్‌లో రైళ్ల నిర్వహణను పర్యవేక్షించారు.
యాత్రికులకు పూర్తి సౌకర్యాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు రైళ్లను నడిపి రద్దీని తగ్గించాలని సూచించారు.
ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద 5,000 సామర్థ్యం గల నాలుగు హోల్డింగ్ ఏరియాలు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఖుస్రో బాగ్‌లో కొత్త హోల్డింగ్ ఏరియా (100,000 మంది సామర్థ్యంతో) ప్రారంభమైంది.
రైళ్ల సమాచారం కోసం సోషల్ మీడియా, ప్రత్యేక బులెటిన్‌లు, స్టేషన్ ప్రకటనలు అందుబాటులో ఉన్నాయి.
రైల్వే శాఖ మహా కుంభమేళా భక్తులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.