Page Loader
హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్ 
హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్

హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్ 

వ్రాసిన వారు Stalin
Oct 08, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

చదవుకు వయసు అడ్డుకాదని నిరూపించారు తెలంగాణలోని హైదరాబాద్‌కు ఓ రిటైర్డ్ ఉద్యోగి. 74 సంవత్సరాల వయస్సులో కె.చిన్న ఎరుకులు బీఎస్‌సీ(ఆనర్స్) కంప్యూటర్ సైన్స్‌లో చేరారు. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) 2023 ద్వారా ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించారు. కె.చిన్న ఎరుకులు ఏపీలో ట్రాన్స్‌కోలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఆయనకు చాలా ఇష్టం. అయితే తన కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన డిగ్రీ చదువుకోలేకపోయారు. ఆ తర్వాత ట్రాన్స్‌కో ఉద్యోగంలో చేరి కొన్ని దశాబ్దాలుగా విధుల్లోనే నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఆయన 74ఏళ్ల వయసుల్లో తాను డిగ్రీ చదవాలన్న కలను సాకారం చేసుకోబోతున్నారు.

డిగ్రీ

అడ్మిషన్ అంత సులువుగా రాలేదు

అయితే కె.చిన్న ఎరుకులకు ఈ వయసులో అడ్మిషన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అడ్మిషన్ పొందేందుకు నిర్దేషించిన గరిష్ట వయోపరిమితి కంటే ఎరుకుల వయసు ఎక్కువగా ఉంది. దీంతో ఆయన దోస్త్ ద్వారా ప్రవేశం కోసం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌ను సంప్రదించారు. దీంతో కె.చిన్న ఎరుకుల కోసం ప్రత్యేకంగా నిబంధనలు సవరించారు. అతని వివరాలను దోస్త్ వెబ్‌సైట్‌లో మాన్యువల్‌గా నమోదు చేశారు. చివరికి అతనికి సీటును ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎరుకుల 2021లో వొకేషన్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు.