Page Loader
Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య
నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య

Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

నంద్యాలలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు. కళ్ళలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నాడు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారు పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. భర్త సుధాకర్ రావు రిటైర్మెంట్ తర్వాత మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్లు చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Details

దర్యాప్తు ను ప్రారంభించిన పోలీసులు 

ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలుసుకున్న దోపిడీ దొంగలు ఇంటికెళ్లారు. ఇక వారిని అడ్డుకొనే ప్రయత్నం చేసిన గ్లాడిస్‌ కళ్లలో కారం కొట్టి గొంతు కోశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేశారు. పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దుండగలు భారీగా బంగారం, నగదును అపహరించినట్లు తెలిసింది. మృతురాలి కూతర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేస్తున్నారు.