
PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
ఈ సందర్భంగా రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ వంతెన మీదుగా ప్రయాణించనున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్‌లో భాగంగా నిర్మించిన ఈ వంతెన చీనాబ్ నదిపై తలెత్తింది.
మొత్తం రైల్వే లింక్ పొడవు 272 కిలోమీటర్లు కాగా, చివరి దశగా కాట్రా-సంగల్దాన్ స్ట్రెచ్‌ను మోదీ ప్రారంభించనున్నారు.
అనంతరం శ్రీనగర్-కాట్రా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హరిపత్రం ఊపనున్నారు.
Details
మెరుగైన రవాణా వసతి సౌకర్యం
ఈ లింక్‌తో న్యూఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడనుంది.
ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేవారికి మెరుగైన రవాణా వసతిని కల్పించనుంది.
ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 43,780 కోట్లు. ఈ మార్గంలో మొత్తం 31 రైల్వే స్టేషన్లు, 36 టన్నెల్స్, 943 వంతెనలు ఉన్నాయి.
ప్రారంభోత్సవం రోజున శ్రీనగర్-కాట్రా, కాట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైళ్లు సేవలు ప్రారంభిస్తాయి.
Details
భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం
రైల్వే శాఖ ఈ వంతెనను ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తోంది.
ఈ వంతెన ఎత్తు 369 మీటర్లు - ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలిచింది.
గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే సామర్థ్యంతో రూపొందించబడింది. నిర్మాణంలో 30,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు.
ఈ వంతెన భూకంపాలకు అధిక ప్రమాదం ఉన్న ఫాల్ట్ జోన్ ప్రాంతంలో నిర్మించారు. అయినప్పటికీ, భూకంపాల్ని తట్టుకునే మన్నికతో నిర్మించామని రైల్వే బోర్డు వెల్లడించింది.