దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రూ.35 కోట్లతో కొనుగోలు చేసిన హై-ఎండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలోనే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ వ్యవస్థను కలిగి ఉన్న మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఆసుపత్రిగా నిమ్స్ అవతరించింది. కంప్యూటర్ స్క్రీన్‌ని ఉపయోగించడం ద్వారా, వైద్యుల మార్గదర్శకత్వంలో రోబోటిక్‌తో శస్త్రచికిత్సలను చేయొచ్చు. రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌పై ఆపరేషన్లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 20 మంది వైద్యులతో కూడిన బృందానికి కఠినమైన శిక్షణను అందించింది. రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌పై అన్ని రకాల శస్త్రచికిత్సలను తక్కువ సమయంలో చేయొచ్చు. అంతేకాకుండా రోబోటిక్ సాయంతో ఆపరేషన్ చేయడం వల్ల పేషెంట్లు కూడా త్వరగా కోలుకుంటారు.
నిమ్స్‌లో కొత్త వైద్య పరికరాల కొనుగోలుకు రూ.154 కోట్ల కేటాయింంపు
నిమ్స్‌లో కొత్త వైద్య పరికరాల కొనుగోలుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.154 కోట్ల గ్రాంట్‌ను కేటాయించారు. అందులో నుంచే రూ. 35కోట్లు వెచ్చించి అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను కొనుగోలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిమ్స్‌లో ఉంది. దాదాపు రూ. 10 కోట్ల వెచ్చించి 150 డయాలసిస్ మెషీన్‌లను కొనుగోలు చేశారు. అలాగే డీఎస్ఏ మిషన్‌కు రూ.13 కోట్లు, ఎంఆర్ఐ మిషన్‌కు రూ. 9 కోట్లు, అడ్వాన్స్ జనరేషన్ జీనోమ్ సీక్వెన్సింగ్ మిషన్ కోసం రూ. 7 కోట్లు, న్యూరో-నావిగేషన్ మెషిన్ రూ. 6 కోట్లుతో సహా అత్యాధునిక వైద్య పరికరాలను నిమ్స్ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసింది.