LOADING...
Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ 
Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ

Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ 

వ్రాసిన వారు Stalin
Mar 11, 2024
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎంసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో బిష్ణుపూర్ సీటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మాజీ భార్యభర్తలు ఈ స్థానం నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటం అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ సౌమిత్రా ఖాన్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. అదే స్థానం నుంచి అతని మాజీ భార్య సుజాత మండల్‌కు టీఎంసీ టికెట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సౌమిత్రా ఖాన్, సుజాత మండల్ విడిపోయారు.

బెంగాల్

2021లో టీఎంసీలో చేరిన సుజాత మండల్ 

2021ఎన్నికల సమయంలో సుజాత మండల్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు సౌమిత్ర ఖాన్ మీడియా వేదికగా ప్రకటించడం అపట్లో సంచలనంగా మారింది. 2019లోక్‌సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయన సతీమణి సుజాత మండల్‌ ఆయన కోసం చాలా శ్రమించి ప్రచారం చేశారు. ఆయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎన్నికల కోసం, మాజీ క్రికెటర్లు యూసుఫ్ పఠాన్, కీర్తి ఆజాద్ వంటి అనేక మంది కొత్త అభ్యర్థులకు టీఎంసీ లోక్‌సభ సీట్లను కేటాయించింది.