
అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!
ఈ వార్తాకథనం ఏంటి
అసోం బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ గోల్‌పరా జిల్లాలో అనునాస్పదస్థితిలో శవమై కనిపించారు.
గోల్‌పరాలో జోనాలి నాథ్ ప్రస్తుతం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జోనాలి నాథ్ జాతీయ రహదారి-17 సమీపంలో పడవేయడంపై తగిన దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను బీజేపీ కోరింది.
జోనాలి నాథ్ మృతదేహం పడి ఉన్న దృశ్యాలను బట్టి ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ ఎమ్మెల్యే , పార్టీ సీనియర్ నేత హేమంగా ఠాకూరియా జోనాలి నాథ్ మృతిపై స్పందించారు. ఇది హత్య అయితే, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని అన్నారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించినట్లు, తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు సూపరింటెండెంట్ రాకేష్ రెడ్డి వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాథ్ మరణంపై పోలీసుల విచారణ
Deeply saddened by the sudden and tragic passing of Smt. Jonali Nath, @BJP4Assam Goalpara District secretary. It is a great loss for all of us.
— Ashok Singhal (@TheAshokSinghal) June 12, 2023
A thorough investigation into the incident will be done to ensure justice is served. We are committed to uncovering the truth behind… pic.twitter.com/PQnHCQveD6