LOADING...
Padma Awards: తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!
తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!

Padma Awards: తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్‌, 13 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. వైద్య రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గానూ ఈ గౌరవం దక్కింది.

Details

11 మందికి పద్మ పురస్కారాలు

ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 11 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వీరిలో పలువురు వివిధ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన వారిలో సినీనటుడు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్‌, మాగంటి మురళీ మోహన్‌, కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్‌, పాల్కొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌, రామారెడ్డి మామిడి, వెంపటి కుటుంబ శాస్త్రి, గూడూరు వెంకట్రావు, దీపికారెడ్డి, గద్దమణుగు చంద్రమౌళి ఉన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement