తదుపరి వార్తా కథనం

Mahatma Gandhi: కడపతో ప్రత్యేక అనుబంధం.. గాంధీజీ నడయాడిన నేల ఇదే!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 15, 2025
08:23 am
ఈ వార్తాకథనం ఏంటి
జాతిపిత మహాత్మా గాంధీజీకి కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1919-20 మధ్య కాలంలో ఆయన రాయలసీమ ప్రాంతంలో పర్యటన జరిపినప్పుడు కడపకు కూడా వచ్చారు. నగరంలోని రామసుబ్బారెడ్డి గృహంలో గాంధీజీ రెండు రోజులుగా బస చేశారు. ఆయనను చూడటానికి నలుమూలల నుంచి వేల మంది అప్పట్లో కడపకు తరలివచ్చారు. గాంధీజీ బస చేసిన ఈ భవనాన్ని ఈరోజు కూడా 'హౌస్ ఆఫ్ కడప గాంధీ' అని పిలుస్తున్నారు. కడపలోని మాసాపేటలోని ఆలయాన్ని కూడా గాంధీజీ సందర్శించారు. ప్రస్తుతం ఈ భవనం ఆసుపత్రిగా ఉపయోగంలో ఉంది.