Page Loader
ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల

ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల

వ్రాసిన వారు Stalin
May 19, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాన్సర్ బాధితుల పిల్లల కసోం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి చదవు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆ పాఠశాల ఏర్పాటు ఈ విద్యా సంవత్సరం నుంచే కార్యరూపం దాల్చింది క్యాన్సర్‌తో బాధపడే చిన్నారులకు కూడా ఈ పాఠశాలలో విద్యను బోధించనున్నట్లు తెలుస్తోంది. భార్యభర్తల్లో ఏ ఒక్కరికి కూడా క్యాన్సర్ వచ్చినా, వారి పిల్లలు చదవుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ

వారం రోజుల్లో పాఠశాల ప్రారంభం

ఇప్పటికే పాఠశాలను ఏర్పాటు చేసి, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించినట్లు ఎంఎన్‌జే ఆస్పత్రి తెలిపింది. మొదటి ఏడాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు బోధిస్తారు. వారం రోజుల్లో పాఠశాలను ప్రారంభించనున్నట్లు ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్ జయలలిత వెల్లడించారు. ఎంఎన్‌జే ఆస్పత్రికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా క్యాన్సర్ బాధితులు వస్తుంటారు. వారందరికి ఈ పాఠశాల ఉపయోగపడనున్నట్లు ఆస్పత్రి, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.