Page Loader
Su-30 MKI jets: రూ.10వేల కోట్లతో యుద్ధ విమానాలను కొనుగోలుకు కేంద్రం ఆమోదం 
Su-30 MKI jets: రూ.10వేల కోట్లతో యుద్ధ విమానాలను కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Su-30 MKI jets: రూ.10వేల కోట్లతో యుద్ధ విమానాలను కొనుగోలుకు కేంద్రం ఆమోదం 

వ్రాసిన వారు Stalin
Nov 22, 2023
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైమానిక దళం బలాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10వేల కోట్లతో అధునాతన 12 సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాల (Su-30 MKI fighter jets)కొనుగోలుకు టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు జారీ చేసినట్లు ఇండియా టుడే నివేదించింది. డిసెంబర్ నెలాఖరులోగా హెచ్‌ఏఎల్ ఈ టెండర్ స్పందించే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. గత 20 ఏళ్లలో 12 సుఖోయ్ యుద్ధ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్రం కొత్తవి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలను భారతదేశంలో హెచ్‌ఏఎల్ మాత్రమే తయారు చేస్తుంది. ఈ విమానాల తయారీలో 60 శాతం స్వదేశీ వస్తువులను ఉపయోగించనున్నారు.

యుద్ధ విమానాలు

రూ.45,000 కోట్ల రక్షణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

వైమానిక దళం వద్ద ఉన్న 272 యుద్ధ విమానాలు ఉండగా, వాటికంటే.. సుఖోయ్-30MKI మాత్రమే అత్యంత ఆధునికమైనదిగా కావడం గమనార్హం. సెప్టెంబరులో‌లో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రూ.45,000 కోట్ల విలువైన 9 రక్షణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో 12 సుఖోయ్-30 ఎమ్‌కెఐ విమానాల కొనుగోలుతో పాటు, ఇప్పటికే ఉన్న యుద్ధ విమానాల మరమ్మతులు, ఉపరితల క్షిపణులు, డోర్నియర్ విమానాల అప్‌గ్రేడేషన్ కూడా ఉన్నాయి. సుఖోయ్-3 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. విమానాల్లో స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, అధునాతన రాడార్, ఏవియానిక్స్‌తో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించాయి.