Page Loader
UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 

UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Feb 24, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి పటియాలీ-దరియావ్‌గంజ్ రహదారిలోని చెరువులో దూసుకెళ్లింది. ట్రాక్టర్‌లో ఎక్కువ మంది భక్తులు ఉండటంతో ప్రాణ నష్టం కూడా భారీగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఉన్నారు.

యూపీ

మృతుల్లో ఏడుగురు చిన్నారులు

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 20 మంది మరణించినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. మృతి చెందిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులు చనిపోయినట్లు ప్రకటించినట్లు పాటియాలీలోని సీహెచ్‌సీ సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించిన మరికొంత మంది క్షతగాత్రులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.