NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు
    చిన్నారి తలపై నుంచి వెళ్లిన కారు

    హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2023
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోన్న ఓ తల్లి తన మూడేళ్ల పాపను వెంట పట్టుకొని పనికి వెళ్లింది. చాలా సేపు ఆడుకున్న ఆ పాప అలసిపోయింది.

    దీంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో పాపను తల్లి నిద్రపుచ్చింది. ఆ తర్వాత ఆమె పనుల్లో నిమగ్నమైంది.

    అయితే అ అపార్టుమెంట్ కు చెందిన ఓ వ్యక్తి బయట నుంచి కారులో వచ్చాడు. పార్కింగ్ స్థలంలో పాప పడుకున్న విషయం తెలియక నేరుగా పాప పైనుంచి కారును పోనిచ్చాడు. దీంతో కారు పాప తలపైకి ఎక్కింది. తీవ్ర గాయాలైన పాప అక్కడిక్కడే మృతి చెందింది.

    కర్ణాటక నుంచి రాజు, కవిత బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వచ్చి.. శ్రీ కృష్ణ నగర్లో నివాసం ఉంటున్నారు.

    Details

    గుండె పగిలేలా ఏడ్చిన తల్లి

    స్థానికులు పాపను వనస్థలిపురం ఏరియా ఆస్ప్రతికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    పాప మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లి గుండె పగిలేలా రోధించింది. కాసేపు పడుకోమని నిద్రపుచ్చితే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయావా అంటూ ఆ తల్లి రోధనలు మిన్నంటాయి.

    ఈ ఘటన చూసిన స్థానికులు చలించిపోయారు. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    సీసీ టీవీ కెమెరాలో నమోదైన ప్రమాద దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆ పాప తల్లిదండ్రులు కోరుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ప్రపంచం

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    హైదరాబాద్

    రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత సికింద్రాబాద్
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు ఐఎండీ
    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  తెలంగాణ

    ప్రపంచం

    వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్ వాట్సాప్
     Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే! బైక్
    WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు స్పోర్ట్స్
    ఏఎన్‌సీ బోట్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయి: వంద గంటల వరకు బ్యాటరీ లైఫ్ స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025