Page Loader
హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్ 
హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్

హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్ 

వ్రాసిన వారు Stalin
May 23, 2023
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకేశాడు. 3వ అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఏడాది జనవరి తర్వాత నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. పరుపు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ ఏజెంట్ కస్టమర్ తట్టాడు. ఈ క్రమంలో పెంపుడు జంతువు డాబర్‌మాన్ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది. ఈ క్రమంలో అతను తప్పించుకునే క్రమంలో 3వ అంతస్థు గోడ నుంచి దూకేశాడని పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్ వాసులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

కుక్క యజమానిపై కేసు నమోదు 

రాయదుర్గం పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 289 కింద కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ చికిత్స ఖర్చులను కుక్క యజమాని భరించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. బంజారాహిల్స్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. స్విగ్గీలో పనిచేసే మహ్మద్ రిజ్వాన్ పార్శిల్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనానికి వెళ్లాడు. అక్కడ కుక్క వెంబడించడంతో అతను 3వ అంతస్థు నుంచి కిందకు దూకి మరణించాడు. కుక్క యజమానిపై బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.