Page Loader
మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటనపై సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అపిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని అందులో పేర్కొంది. ప్రస్తుతం అధికారికంగా ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారించాలని కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. మణిపూర్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించిన తర్వాతే ఆ కేసును సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. ఇండియాకు కూటమికి చెందిన 21 మంది ఎంపీలు నేడు మణిపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ