Student Suicide in Kota: కోటాలో ఆగని సూసైడ్స్.. మరో నీట్ విద్యార్ధి ఆత్మహత్య!
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని కోటాలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని మొరాదాబాద్‌కు చెందిన మహమ్మద్ జైద్(Mohammed Zaid), మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్(NEET)కు సిద్ధమవుతున్నాడు.
కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలోని హాస్టల్‌లో నివాసం ఉండేవాడు. గత రాత్రి తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు.
జైద్ నీట్‌లో తన రెండవ ప్రయత్నానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కోట చేరుకున్న తర్వాత పోస్ట్ మార్టం నిర్వహిస్తారు.
Details
కోచింగ్ సెంటర్లకు కేంద్రంమార్గదర్శకాలు
అతని గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ ఏదీ కనుగొనబడలేదు. జైద్ ఆత్మహత్యకు కారణం తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరోవైపు, విద్యార్థుల ఆత్మహత్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులు, కోటా కోచింగ్ సెంటర్లు చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంఘటనతో మరో ఎదురుదెబ్బ తగిలింది.
గత ఏడాది రాజస్థాన్ కోచింగ్ హబ్‌లో 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు కోచింగ్ సెంటర్లకు గత ఏడాది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్రం కూడా గత వారం కోచింగ్ సెంటర్ల కోసం వరుస మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడంపై నిషేధం, విద్యార్థులకు వినోదం ఉండేలా సూచనలు ఉన్నాయి.