Jharkhand woman gangrape:జార్ఖండ్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్‌లోని పలము జిల్లాలో 32 ఏళ్ల మహిళపై ఇద్దరు సీనియర్ అధికారుల డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
పాలము డిప్యూటీ కమిషనర్ ఎస్కార్ట్‌లో ఉన్న డ్రైవర్ ధర్మేంద్ర కుమార్ (30),పాలము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివాసంలో డ్రైవర్ ప్రకాష్ కుమార్ (40)ను అరెస్టు చేశారు.
మహిళ ఫిర్యాదు ప్రకారం,గురువారం (డిసెంబర్ 28) ఉదయం ఆమె డాల్తోన్‌గంజ్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి మొబైల్ రీఛార్జ్ దుకాణానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
Details
రెండు గంటల్లో నిందితుల అరెస్ట్
ఆమె మొబైల్ ఫోన్‌కు రీచార్జ్ చేస్తాననే నెపంతో ఇద్దరు డ్రైవర్లు మహిళను, బలవంతంగా రెసిడెంట్స్ క్వార్టర్స్ కి తీసుకెళ్లారు.
అక్కడ వారిద్దరూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో యువతి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నారు.
ఘటనను పాలము ఎస్పీ రిష్మా రమేశన్ ధృవీకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నిందితులను,మహిళను వైద్య పరీక్షల కోసం మేదినిరాయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.