తదుపరి వార్తా కథనం

Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 01, 2024
03:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతాలో ఓ మహిళ తన సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపి,నేరం గురించి పోలీసులకు తెలియజేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.ఈ సంఘటన బుధవారం జరిగింది.
కాల్ అందుకున్న పోలీసు బృందం డమ్‌డమ్ ప్రాంతంలోని సంహతి పాల్ అనే మహిళ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.
బాధితుడు సార్థక్ దాస్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా,అతను చనిపోయినట్లు ప్రకటించారు.
సార్థక్ దాస్ ఒక ఫోటోగ్రాఫర్.సంహతి పాల్‌తో సహజీవనం చేస్తున్నాడు.ఆమహిళ వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్.గత కొన్ని రోజులుగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి.
బుధవారం ఉదయం ఆ మహిళ దాస్‌ను పదునైన కత్తితో పలుమార్లు పొడిచిందని పోలీసులు తెలిపారు.
విచారణలో పాల్ నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హత్యానేరం కింద మహిళను అరెస్టు చేశారు.