Page Loader
Pregnant: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మూడోసారి గర్బం దాల్చిన మహిళ.. వైద్యుడిపై చర్యలు!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మూడోసారి గర్బం దాల్చిన మహిళ.. వైద్యుడిపై చర్యలు!

Pregnant: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మూడోసారి గర్బం దాల్చిన మహిళ.. వైద్యుడిపై చర్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2023
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడో సారి గర్భం దాల్చింది. ఈ ఘటన బిహార్ రాష్ర్టంలోని ముజఫర్ ఫూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ముజఫర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది పిల్లలు వద్దనుకొని గైఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2015లో కు.ని ఆపరేషన్ చేయించుకుంది. తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా రెండుసార్లు గర్భం దాల్చాలని బాధితురాలు వాపోయింది. అయితే మళ్లీ మూడోసారి తాను గర్భం దాల్చానని పేర్కొంది.

Details

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం:  ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి 

దీనిపై వైద్యులు ఆ గర్భిణికి వైద్య పరీక్షలు చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా గర్భం దాల్చడంతో 2018వ సంవత్సరంలో జిల్లా మెజిస్ట్రేట్ ఆ బాధితురాలికి పరిహారంగా ఆరువేల రూపాయలిచ్చారు. దీంతో తనకు చేసిన కుటుంబ నియంత్రణ చేసిన ఆ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి సివిల్ సర్జన్ తెలిపారు.