
Hyderabad : విషాదం.. అమెరికాలో నీటమునిగి హైదరాబాద్ యువకుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌కు చెందిన ఓ యువకుడు గత శనివారం అమెరికాలో చికాగోలో ఈతకెళ్లి మృతి చెందాడు.
ఆ యువకుడి మృతదేహాం ఆదివారం స్వస్థలానికి చేరుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు కాటేదాన్‌లో స్థిరపడ్డారు.
వీరికి అక్షిత్ రెడ్డి(26) కుమారుడు ఉన్నారు.
Details
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు
చికాగోలో ఎమ్మెల్యే పూర్తి చేసిన మృతుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.
ఇక రెండు నెలల్లో కుమారుడికి పెళ్లి ఏర్పాట్లు చేయాలని బంధువులు భావించారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్ మిశిగన్ లో ఈతకెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండిపోగా మరో ఇద్దరు చెరువు మధ్యలోని రాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అక్షిత్ రెడ్డి కష్టపడి అక్కడి చేరుకోగా, తిరిగొచ్చే క్రమంలో అలసిపోయి అక్కడే నీట మునిగిపోయాడు. ఇక సమాచారం తెలుసుకున్న మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు.