మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త
అతను అనుకుంటే విలాసవంతమైన జీవితం తన కాళ్ల ముందుకు వస్తుంది. చుట్టూ పదిమంది పనివాళ్లతో దర్జాగా బతికే అవకాశం ఉన్నా.. అతనికి ఆ జీవితం సంతృప్తిని ఇవ్వలేదు. రూ.కోట్లలో జీతం.. అతి పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి జైన సన్యాసిగా మారాడానికి ముందుకొచ్చాడు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రన్సుఖ్ కాతేడ్(28). ఇంజినీరింగ్ పూర్తి చేసి 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తర్వాత డేటా శాస్త్రవేత్తగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఏడాదికి అక్షరాలా రూ.1.25 కోట్లు జీతం.. ఇలాంటి ఆడంబరమైన జీవితాన్ని వదులుకుని.. నిరాండంబర జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యాడు. జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకోవడంతో వెంటనే రాజీనామా చేశారు.
తల్లిదండ్రులు ఆమోదం
2021 జనవరిలో అమెరికా నుంచి భారత్ కు తిరిగొచ్చాడు. ఈ నెల 26న జినేంద్ర ముని వద్ద జైన సన్యాస దీక్ష తీసుకోకున్నాడు. తనతో పాటు మరో ఇద్దరు యువకులు సన్యాస దీక్షను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సాధువులు హాజరుకానున్నారు. తమ కుమారుడు జైన సన్యాసి కాబోతుండటంపై అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. గతంలోనూ పలువురు యువకులు, యువతులు.. ఇలా సన్యాసి దీక్షను స్వీకరించిన విషయం తెలిసిందే. మరి కోట్ల రూపాయల జీతం లభించే ఉద్యోగం వదులుకుని మరి సన్యాసిగా మారుతున్న ప్రన్‌సుఖ్ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా..