Page Loader
India Bloc: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌!
ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌!

India Bloc: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బయటకు పంపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తుందనే వార్తలు వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌పై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు దీనికి కారణమని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా,ఇండియా కూటమిలో అద్భుతమైన ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కూటమి నుంచి కాంగ్రెస్‌ను తప్పించేందుకు ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆప్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కేజ్రీవాల్‌ ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలను అమలు చేస్తామనే వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శలు చేయడం వల్ల ఆప్‌ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

వివరాలు 

ఇండియా కూటమిలో కోల్డ్‌ వార్‌

ఈ పరిణామాలు భవిష్యత్‌లో ఇండియా కూటమి రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో కోల్డ్‌ వార్‌ నడుస్తున్నవిషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా ఓడిపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసి పరాజయం పొందడంతో, కూటమి ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, మమతా బెనర్జీ ఇండియా కూటమికి చీఫ్‌ పగ్గాలు చేపట్టాలనుకుంటున్నట్టు చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠ భరితంగా మార్చింది. కూటమిలోని పలు పార్టీల నేతలు ఆమెకు మద్దతు తెలపడంతో,ఇలాంటి పరిస్థితుల్లో ఆప్‌ తీసుకున్న తాజా నిర్ణయం కూటమిలో మరింత చిచ్చు పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.