LOADING...
Aarogyasri Services Halt: తెలంగాణలో 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం.. ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..
ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..

Aarogyasri Services Halt: తెలంగాణలో 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం.. ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి రాష్ట్రంలోని 330 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడానికి నెట్‌వర్క్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతేకాక, గత 22 నెలలుగా EHS, JHS బకాయిలు వసూలు చేయలేదని కూడా నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి.

వివరాలు 

పెండింగ్‌లో 1400 కోట్ల రూపాయల బకాయిలు 

తెలంగాణలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. గత 20 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ప్రాథమికంగా, ఈ నెల 1 నుండినే సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆ తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో కూడా సమావేశాలు జరిపారు. ఆ చర్చల తర్వాత తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రభుత్వ స్పందన సరైనంత వేగంగా రాకపోవడం, సుమారు 1400 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటం, అలాగే 22 నెలలుగా ఈహెచ్ఎస్, జీహెచ్‌ఎస్ సేవలకు సంబంధించిన చెల్లింపులు అందని పరిస్థితులు... ఈ కారణంగా ఆసుపత్రులను నడిపించడం కష్టంగా మారిందని నెట్ వర్క్ ఆసుపత్రుల యాజ్యమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

వివరాలు 

తెలంగాణ వ్యాప్తంగా 330 నెట్‌వర్క్ ఆసుపత్రులు నిలిపివేయడానికి సిద్ధం  

ఈ పరిస్థితుల కారణంగా బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే, ఆసుపత్రులు సాధారణంగా కార్యకలాపాలు కొనసాగించలేమని వారు ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 330 నెట్‌వర్క్ ఆసుపత్రులు అన్ని ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధమైన చర్య తీసుకుంటుందో చూడాలి.