Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 13, 2024
08:54 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేటి ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి