Page Loader
Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి 
రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. 2025 జనవరి 13 నుంచి 23 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు ఈ అనుమతిని జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో, రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన విషయం ఇప్పటికే అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఆయన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టును అభ్యర్థించారు. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి నగరాలకు పర్యటించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. పాస్‌పోర్టును ఆరు నెలలపాటు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, జులై 6 నాటికి పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది.