LOADING...
Liquor scandal: రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!
రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!

Liquor scandal: రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన రూ.3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో స్పష్టంగా వివరించాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సిట్‌ను ఆదేశించింది. ఈ వివరాలను ఓ పట్టిక రూపంలో సమర్పించడంతో పాటు ఫోరెన్సిక్‌ నివేదికలను కూడా జతచేయాలని కోర్టు సూచించింది. కేసులో నిందితుల జాబితాలో ఉన్న సంస్థల ప్రతినిధులు, వారి హోదాల పూర్తి వివరాలను సమగ్రంగా ఇవ్వాలని కూడా ఆదేశించింది. జూలై 19న సిట్‌ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రంలో పలు అంశాలపై మరిన్ని వివరణలు అవసరమని గుర్తించిన ఏసీబీ కోర్టు సోమవారం మెమో జారీ చేసింది. ఇందులో మొత్తం 21 అంశాలను ప్రస్తావిస్తూ, మూడు రోజుల్లోగా పూర్తి వివరాలను సమర్పించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.

Details

కోర్టు స్పష్టత కోరిన ముఖ్యాంశాలు ఇవి

అవినీతి నిరోధక చట్టం 1988 వర్తింపు ఈ కేసులో ఆ చట్టంలోని ఏఏ సెక్షన్లు వర్తిస్తాయి? ముఖ్యంగా సెక్షన్‌ 19 ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రధాన నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేయడం ఎలా సాధ్యమైందో వివరణ ఇవ్వాలని సూచించింది. సాక్షుల వివరాలు సీఆర్‌పీసీ 161, 164 సెక్షన్ల కింద ఇప్పటివరకు ఎన్ని సాక్షులను విచారించారో, వారి జాబితా సమర్పించాలని ఆదేశించింది. అభియోగపత్ర స్థితి దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉందని ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొన్నప్పటికీ, ఇది ఫైనల్ చార్జ్‌షీటా లేక ప్రాథమికమా అనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరింది.

Details

ప్రత్యేక నిందితుల ప్రమేయం

ముప్పిడి అవినాష్‌రెడ్డి (A-7), బూనేటి చాణక్య (A-8), టీ. ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి (A-9), షేక్‌ సైఫ్‌ అహ్మద్‌ (A-10), ఓల్విక్‌ మల్టీవెంచర్స్‌ (A-11), క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్‌ (A-12), నైస్న మల్టీవెంచర్స్‌ (A-13), ట్రిఫ్పెర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (A-14), విక్సో ఎంటర్‌ప్రైజెస్‌ (A-15) వంటి సంస్థలు, వ్యక్తుల ప్రమేయం, పాత్రపై స్పష్టమైన వివరాలు చార్జ్‌షీట్‌లో ఇవ్వాలని ఆదేశించింది. వీరిలో కొందరిని ఎందుకు అరెస్టు చేయలేదో కారణాలను కూడా తెలియజేయాలని సూచించింది. అదనంగా, నిందితులపై వర్తించే ప్రత్యేక సెక్షన్లను విడిగా పేర్కొనాలని ఆదేశించింది అరెస్టులపై సమాచారం ఇప్పటివరకు ఎన్ని నిందితులను అరెస్టు చేశారో, వారిలో ఎవరెవరు ఎప్పటి నుంచి జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారో పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది.