
Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) పై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.
2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి.
ఈ కేసులో విడుదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను ఏ1 గా చేర్చారు.
ఇక ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా రజనీ మరిది గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణ ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
Details
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 7ఏతో పాటు IPC సెక్షన్ 384, 120బి కింద కేసు నమోదు చేశారు.
స్టోన్ క్రషర్ యాజమాన్యం బెదిరింపులపై ముందుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఫిర్యాదు చేసింది.
విచారణ అనంతరం ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.
శనివారం అధికారులు విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విడుదల రజనీపై ఈ కేసు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.