Page Loader
Access Now Report: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌లోనే ఎక్కువ
ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌లోనే ఎక్కువ

Access Now Report: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌లోనే ఎక్కువ

వ్రాసిన వారు Stalin
Feb 28, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో ఇంటర్నెట్ అంతరాయాలు భారత్‌లోనే అధికంగా జరుగుతున్నాయని అంతర్జాతీయ డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ, కీప్ ఇట్ ఆన్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక చెబుతోంది. 2022లో భారత్‌లో అత్యధికంగా 84ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగినట్లు పేర్కొంది. వరుసగా ఐదో సంవత్సరం ఇంటర్నెట్ అంతరాయాల జాబితాలో భారత్ టాప్‌లో నిలవడం గమనార్హం. 2016నుంచి అంతరాయాల జాబితాను పరిశీలిస్తే ఒక్క భారత్ వాటా58% ఉన్నట్లు నివేదిక చెబుతోంది. గతేడాది అత్యధికంగా జమ్ముకశ్మీర్‌లో కనీసం 49సార్లు ఇంటర్నెట్‌ను షట్‌డౌన్‌ చేసిన యాక్సెస్ నౌ నివేదికలో పొందుపర్చారు. ఇందులో కేవలం మూడు రోజుల్లోనే 16సార్లు బ్యాక్ టు బ్యాక్ షట్‌డౌన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో 12, ​​పశ్చిమ బెంగాల్‌లో ఏడు, హర్యానా, జార్ఖండ్‌లలో నాలుగు చొప్పున షట్‌డౌన్‌లు జరిగాయి.

ఇంటర్నెట్

డిజిటల్ జీవనోపాధిపై ప్రభావం: పసిఫిక్ పాలసీ డైరెక్టర్

నిరసనలు, సంఘర్షణలు, పాఠశాల పరీక్షలు, ఎన్నికలు వంటి హై-ప్రొఫైల్ ఈవెంట్ల సమయంలో అధికారులు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో 84సార్లు ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేయాన్ని యాక్సెస్ నౌ సీనియర్ అంతర్జాతీయ న్యాయవాది, ఆసియా పసిఫిక్ పాలసీ డైరెక్టర్ రామన్ జిత్ సింగ్ చిమా తప్పుబట్టారు. జీ20కి అధ్యక్షత వహించే దేశంలో ఈ అంతరాయాలు భారతదేశ సాంకేతిక ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ జీవనోపాధి ఆశయాల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని చిమా వివరించారు. ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లపై ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ ఇంటర్నెట్‌షట్‌డౌన్ విషయంలో స్పష్టమైన మార్గనిర్దేశకాలు రూపొందించాలని టెలికాం శాఖకు సూచించింది.